తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు

యువకుడు సినిమాతో తన నాజూకు అందాలను తెలుగు తెరకు పరిచయం చేసిన భూమిక అనంతరం తమిళం, హిందీ చిత్రాలలో నటించి ప్రత్యేకమైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రల ద్వారా ప్రశంసలను విజయాలను అందుకుంది. ఈమెకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారంలభించింది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న భూమిక తన రీ ఎంట్రీ తరువాత అక్కా .. వదిన పాత్రలలో కనిపిస్తోంది. ఆ పాత్రలకి ప్రాధాన్యత ఉంటేనే ఆమె అంగీకరిస్తుంది. అలా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’.. ‘ సవ్యసాచి’ వంటి సినిమాల్లో నటించిన భూమిక, తాజాగా మరో సినిమాలో అక్క పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో అక్క పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో, భూమికను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.