బాబాయ్ అబ్బాయ్ కొత్తగా..

‘కథానాయకుడు’ తర్వాత ‘మహానాయకుడు’ చిత్రాన్ని పకడ్భందీగా రిలీజ్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ, క్రిష్ టీమ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే రీషూట్లు పూర్తి చేసి బెటర్ మెంట్ కి ప్రయత్నించారని సమాచారం.  రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, కళ్యాణ్ రామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. నారా వారి మనవడు దేవాన్ష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నిపనులు పూర్తి చేసి సినిమాని ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు. ఈ సీక్వెల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న కసితో ఎన్బీకే టీమ్ వర్క్ చేశారని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మహానాయకుడు కొత్త పోస్టర్‌లో బాబాయ్ వా అబ్బాయ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఇదే చిత్రానికి పోటీగా తన చిత్రాన్ని రిలీజ్ చేస్తానని వివాదాల దర్శకుడు ఆర్జీవీ కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. అతడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని పోటీకి రెడీ చేస్తున్నారని ప్రచారం ఉన్నా అందుకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉందింకా.

Leave a Reply

Your email address will not be published.