ఎమ్ఎమ్ఆర్ట్స్ బ్యానర్‌లో మనోజ్

వైవిధ్య భ‌రిత చిత్రాలు న‌టించినా… ఎందుకో మంచు మనోజ్ హీరోగా నిల‌దొక్కుకోలేక పోయాడు. ఆత‌నికి కుటుంబ ప‌రంగా అనేక స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో కొంత వెనుక బ‌డ్డాడ‌నే చెప్పాలి. అయితే తాజాగా మ‌రోమారు త‌న‌ని త‌ను నిరూపించుకునేందుకు  హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  ఎమ్ఎమ్ఆర్ట్స్ బ్యానర్‌లో మనోజ్ తల్లి నిర్మలాదేవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు  శ్రీకాంత్‌రెడ్డి.
 వరుస ఫ్లాపులతో ఓ ద‌శ‌లో చిత్రాల‌లో న‌టించ‌డం ఆపేసిన మంచు మ‌నోజ్  దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రంతో వ‌స్తున్నారు. ఈ  చిత్రానికి ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌ను చిత్రయూనిట్ ఖరారు చేస్తూ  పోస్టర్‌ను గురువారం  విడుదల చేశారు.  మార్చి 6న ఈ మూవీని విడుదల చేయ‌ట‌మే ల‌క్ష్యంగా  షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. మ‌రోవైపు నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాలు సైతం త‌మాంత‌రంగా నిర్వ‌హిస్తున్నారు. 
ఈ చిత్రంలో మ‌నోజ్ మ‌రోమారు న‌టుడిగా త‌న సత్తాని చూపిస్తాడ‌ని  బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడ‌ని చెపుతున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ రెడ్డి.  

Leave a Reply

Your email address will not be published.