రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య

ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ`. ఈ చిత్రాన్ని జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్న సందర్భంగా యంగ్ హీరో నాగశౌర్య మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
ఇంతవరకు లవ్వర్ బాయ్ చిత్రాలు చేసిన మీరి ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఎందుకోవటంలో ఆంతర్యమేంటి?
మీరు చెపుతున్నది నిజవే. అయితే నటుడన్నాక అన్ని రకాల సినిమాలు చేయాలి కదా? పైగా. సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాత్యాలకు సంబంధించిన కథాంశం. దీనిపై వచ్చిన వార్తాంశాలు నన్ను బాగా ప్రభావితం చేయటం వల్లే సినిమాకు తగిన విధంగా కథ రాసుకున్నా. నా కెరీర్ లో ఇంత సీరియస్ అండ్ ఇంటెన్స్‌తో కూడిన ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు. దర్శకుడు కూడా అంత బాగా తీసాడు . సినిమా చూసే వారికి ఇంటెన్స్, ఎమోషనల్ ఉండాలి కదా.. అప్పుడే అందరూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి సినిమాకు కనెక్ట్ అవుతారు. సినిమా మేం అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది. అవుట్ ఫుట్ చాలా సంతృప్తి కలిగించింది.
అన్నట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమాతో చాలా నేర్చుకున్నానని చెప్పారుగా… ఇంతకీ ఏం నేర్చుకున్నారేంటి?
అవును ఇప్పుడూ అదే చెపుతున్నా, సినీ కథ నుంచి నిర్మాణం, బడ్జెట్ ఇలా చాలా నేర్చుకున్నా… సినిమా మధ్యలో కొంతమంది వెళ్లిపోయారు నిరుత్సాహ పరిచారు. అయితే ఇంకొంత మంది వచ్చి మా యూనిట్‌ని ఉత్సాహ పరిచారు. బముశా అందువల్లే చాలా విషయాలలో నాకు కొంత అవగాహన వచ్చిందని మాత్రం చెప్పగలను.
అవును మీ ఛాతి మీద సినిమా టాటూ వేయించుకున్నారటగా…
అవును ఈ సినిమా రిజల్ట్ తేలకముందే సినిమా పేరును ట్యాటూ గా వేయించుకున్నా… ఎందుకంటే నా మదిని తాకిన సినిమా ఇది. ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.
ఇంత ఎమోషనల్ సినిమా కథ మీరే రాసుకున్నారు కదా? మీ పాత్ర ఉన్నతంగా ఉంచుకుంటూ మిగతా పాత్రలను ఎలా బ్యాలెన్స్ చేశారు?
అవును కథ నేనే రాసుకున్నదే. అయితే ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకంగా మలచాం. ప్రతి పాత్రకు ఏదో ఒక ప్రాధాన్యత ఉండేలా చూసా. ముఖ్యంగా విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కేవలం హీరో క్యారెక్టర్ ఒక్కటే హైలెట్ అయితే చాలా సినిమాలు బెడిసి కొట్టిన సందర్భాలు మన ఇండస్ట్రీలోచూసాం. ప్రతి నాయకుడి పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే హీరోకి ధీటుగా ఉన్న విలన్ ని ఈ సినిమాలో చూడొచ్చు.
మీమిత్రుడి నిజజీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశానని చెప్పారుగా… మిమ్మల్ని అంతలా ఆ ఘటన ప్రభావితం చేసిందా? కాస్త వివరంగా చెప్పండి.?
అవును మీరన్నది నిజమే… నిజంగా జరిగిన ఘటనలని ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తుల నుంచి అనుమతులు తీసుకుని అక్షర బద్ధం చేసారు. వాళ్లు తమకు దేవుడు అన్యాయం చేసాడని, సన్నిహితుల్ని కోల్పోయామని చెప్పిన తీరు నాలో ఆవేదన రగిల్సింది. నాకు నిజ జీవితంలో చెల్లెళ్లు లేరు. కానీ నాకు ఏటా రాఖీ కట్టే ప్రియ అనే అమ్మాయి ఉంది. నాకుటుంబ సభ్యురాలితో నాకు సమానం. బహుశా దానిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? అన్న భావన నాలో ఆరంభమై ఈ కథ పుట్టింది. అనుకొని ఘటనలు జరగక ముందే కొంత మంది అమ్మాయిలకైనా ఇలా కూడా జరగొచ్చు కొంచెం జాగ్రత్త తీసుకోండి అని కొంచెం కమర్షియల్ వేలో చెప్పడమే చిత్ర లక్ష్యం.
ఈ సినిమాకి చాలా మంది కొత్త టెక్నీషియన్స్ పనిచేసారని, ఈ సినిమా ద్వారా మీరు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు టాక్. ఇది రిస్క్ అనిపించలేదా?
లేదు. కొత్తగా వచ్చి వాళ్లని ప్రోత్సహించినప్పడే వాళ్లలోని టాలెంట్ బైటకు వస్తుంది. అంతెందుకు నేను కొత్తగా వచ్చినప్పుడు సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్ నాకు ఛాన్స్ ఇచ్చారు కనుకే నిలదొక్కుకున్నా. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్లకి ఛాన్స్ ఇవ్వకపోతే నేను కూడా అన్యాయం చేసినట్టే. ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్, కెమెరామెన్ ఇలా అంతా కొత్తవాళ్లే. వాళ్లప్రతిభ ఏపాటిదో మీరు తెరమీద చూడొచ్చు.
మరి అంత ఎమోషనల్ ఫీలయిన మీరు, మీ కథని మీరే డైరెక్ట్ చెయ్యాలనుకోలేదా? ?
షూటింగ్ ఆరంభించ ముందే స్క్రిప్టు ముందేసుకుని ప్రతి షాట్ గురించి ఎలా తీయాలి, ఏ లెన్స్ వాడాలి. నటులలో భావాలెలా పలకాలి. ఫ్రేమ్ ఎలా ఉండాలి? ఎవరు కవర్ అవ్వాలి ఇలా ప్రతి విషయం మా టీమ్ అందరం కలిసి కూలంకషంగా డిస్కస్ చేసుకునే వాళ్లం. అయితే డైరెక్షన్ చేద్దామనే ఆలోచన నాకు ఇప్పటివరకూ రాలేదు. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదు నాకు డైరెక్షన్ లో మనం వేలు పెట్టి దర్శకుడు మూడ్ పాడు చేయటం పద్దతి కాదు. అందుకే అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా రమణతేజ చూసుకున్నాడు. అందరం కలిసి మంచి సినిమాని తీసుకువస్తున్నామని భావిస్తున్నా.
అవునూ… సాహో అంతటి భారీ చిత్రానికి పనిచేసిన గిబ్రాన్ ని ఈ చిత్రానికి ఎలా ఒప్పించారు?
గిబ్రాన్ గారు మా సినిమాకి మంచి అసెట్ అని చెపుతాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలని నేననుకున్నా. ఇంతటి మంచి ఎమోషల్ కథకు మంచి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ అయితే సన్నివేశం ప్రేక్షకుడిని ఉత్తేజితుడిని చేస్తుంది. సాహులో గిబ్రాన్ గారు అవుట్ ఫుట్ చాలా బాగా నచ్చింది. అనుకున్నదే తడు గిబ్రాన్ గారి దగ్గరకు వెళ్లి కథ చెప్పాం. అంతా విన్నాక ఆయన శౌర్య! కథ విన్నాను బాగా నచ్చింది, కానీ సినిమా అంతా అయ్యాక బ్యాక్ గ్రౌండ్ కొట్టాల లేదా అన్నది చెప్తానని అన్నారు. మాకేమో టెన్షన్. అయినా అవి బైటకు కనిపించనీయకుడా సినిమా పూర్తి చేసి గిబ్రాన్ గారికి చూపించా. అంతే ‘వుయ్ హ్యావ్ ఏ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్’ అంటూ నన్ను ఎత్తుకున్నంత పనిచేసారు. ఆయన ఎంతలా ఎగ్జైట్ అయ్యారంటే… మీరు నమ్మరు కానీ… కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఆర్.ఆర్ ఇచ్చారండీ
ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ‘రాక్షసన్’ సినిమా ఫీల్ కలిగింది… సినిమా కూడా అలానే ఉంటుందంటారా?
మీరన్నది నిజమే…. అయితే ‘రాక్షసన్’ సినిమా ఒక్కటే చెపితే ఎలా? ‘ఖాకి’, ‘ఖైదీ’ లాంటి సినిమాలని చూస్తున్నామన్న ఫీల్ కలగటం ఖాయం. ఈ సినిమాలో ఒక్క విలన్ పాత్ర మినహా ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న జెన్యూన్ కథ అని మాత్రం చెప్తాను.
అది సరే ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న మీరు షడన్‌గా . మీ జోనర్ సినిమాల్ని వదిలేసి కొత్త జోనర్ వైపె ఎందుకు దృష్టి మరల్చారు?
లేదండీ ఇప్పటికే నేను దాదాపు చేసినవన్నీ లవ్ స్టోరీస్ సినిమాలే నాకూ బోర్ కొట్టేస్తోంది. అవే పాటలు, అదే పాత్రలు, పాత ప్రేమకథలు తిప్పి తిప్పి ఒకే మూసకి వచ్చేస్తున్నామనిపించింది. అందుకే కాస్త దూరంగా జరిగా. నా కెరీర్లో నేను కూడా ఎలాంటి పాత్ర ఇచ్చినా శౌర్యా చేయగలగడని చెప్పుకునేలా ఉండాలన్నది నా ప్రయత్నం. నటుడిగా నేను ఎదగాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి కదా. `అశ్వథ్థామ`తో నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను. మీరు కూడా ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఒక డిఫరెంట్ శౌర్యని చూస్తారు. ఈ చిత్రం విడుదల తదుపరి నాకు వచ్చే కథలు మారతాయని అనుకుంటున్నాను.
ఇంతకీ భారతంలోని `అశ్వథ్థామ`కి మీ `అశ్వథ్థామ`కి పోలిక ఉందా?
భలేవారే! మహా భారతంలో నిండు సభలో తను కౌరవ పక్షపాతే అయినా పాండు పట్టమనిషి ద్రౌపదికి అవమానం జరుగుతుంటే దాన్ని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి `అశ్వథ్థామ`. మా హీరో క్యారెక్టర్ కూడా అలాంటిదే… అందుకే ఈ టైటిల్ పెట్టాం. అన్నట్టు పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో `అశ్వథ్థామ` గురించి చెప్పే డైలాగ్ ఉంది. ఇది మాకు చాలా బలాన్ని ఇచ్చింది. అందుకే ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ గారి అనుమతి తీసుకుని మరీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ డైలాగ్ వాయిస్ ఓవర్ గా సినిమా ఆరంభంలో వినిపించేలా ఉంచాం.
ఇక ఈ సినిమా విడుదల తరువాత మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ?
లేదండీ … ఇప్పటికే అవసరాల శ్రీనివాస్ గారితో ఓ సినిమా చేస్తున్నా కదా? ఈ సినిమా 3 షెడ్యూల్స్ అయిపోయాయి, మరో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అలాగే ప్రేమకథలు ప్రత్యేకంగా చేసే దర్శకురాలు నందిని రెడ్డి గారు ఈ మధ్య ఒ కథ వినిపించారు. బాగుంది. దాన్ని మరికొంత సరి కొత్తరకం ప్రేమకథ రూపొందించే పనిలో ఉన్నారామె. అది పూర్తికాగానే షూటింగ్ ఆరంభిస్తాం. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఓ లవ్ స్టోరీ చేయాలని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించిన కథని నేనే రెడీ చేస్తున్నా. ఇందులో వేరే హీరో నటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే `అశ్వథ్థామ` రిలీజ్ కోసమే మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫలితం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా….