తొలి పాటను విడుదల చేసిన ‘మిస్ ఇండియా’ టీమ్

జాతీయ ఉత్తమనటి అవార్డుని ‘మహానటి’తో దక్కించుకున్న కీర్తిసురేశ్ తాజాగా మిస్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. . నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని తొలి పాటను శుక్రవారం రాత్రి చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూరప్‌లో అందమైన లొకేషన్స్‌లో హీరోయిన్ తన జీవితంపై పాడుకునేలా ‘‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగి సారంగమై లిప్తలో క్షిప్తమై కాననే కాలమే మొలకలే వేసె నా సొంతమై…’’ అంటూ ఈ పాట విడుదల చేసారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతంసారధ్యంలో. శ్రేయా ఘోషల్, తమన్ పాటను వినసొంపుగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ – “`మహానటి`తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కీర్తి సురేశ్ జాతీయ అవార్డు అందుకున్నాక తెలుగులో తొలి చిత్రం నటిస్తున్న సినిమా మా బ్యానర్లోనే కావడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను ఈ నెలలో పూర్తి చేసి సినిమాను మార్చిలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.