జోరుగా.. హుషారుగా.. షికారుపోద‌మా

తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డికి హిందీ రీమేక్‌గా కబీర్ సింగ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోహీరోయిన్లుగా చేస్తున్న షాహిద్ కపూర్, కైరా అద్వానీలు షూటింగ్ గ్యాప్‌లో సరదాగా బైక్‌పై షికార్లు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఢిల్లీ నగరంలో వణికించే చలిని కూడా లెక్క చేయకుండా కియారా, షాహిద్‌లు జోకులు వేసుకుంటూ బైక్ రైడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా… అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగానే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా కథలో చిన్నచిన్న మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ హిందీ అర్జున్ రెడ్డి ఎంతమేరకు విజయం సాధిస్తాడో కానీ… హీరోయిన్‌తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగేయడం మాత్రం వైరల్ అయిపోయిందనేది సినీజనం గుసగుసలు.

Leave a Reply

Your email address will not be published.