జనసేన పార్టీ లెటర్ హెడ్ ఫోర్జరీ పై సీపీకి ఫిర్యాదు

సీతారాంపురం (విజయవాడ ), న్యూస్ టుడే  :  జనసేన పార్టీ లెటర్  హెడ్ ఫోర్జరీ పై  సోమవారం   
పార్టీ  లీగల్ సెల్ ప్రతినిధులు  విజయవాడ  పోలీస్ కమిషనేర్ ద్వారకాతిరుమలరావును కలిసి ఫిర్యాదు చేసారు. ఫోర్జరీ చేసిన లెటర్  హెడ్ లో  నగరంలోని తూర్పు , మధ్య ,పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీన్ని గుర్తించిన జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సెంట్రల్ లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెన్న యతీంద్ర , ప్రధాన  కార్యదర్శి  గుండపు  రాజేష్ కుమార్, పార్టీ కి చేందిన పలుమారు న్యాయవాదులు సీపీని  ఆయన కార్యాలయంలో  కలిసి ఫిర్యాదు చేసారుదీనిపై బాధ్యులను గుర్తించి చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారుఫిర్యాదు ప్రతిని సీపీ ద్వారకాతిరుమలరావు  సీసీఆర్ బి  (సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో )కు న్యాయసలహా కోసం పంపించారు

Leave a Reply

Your email address will not be published.