స్పీకర్‌ ప‌ద‌వికి ఆయ‌న అర్హుడేనా..? పంచుమర్తి అనురాధ

కరోనా భయంతో జనం వణికిపోతుంటే ఎన్నికల గురించి ఎపి సిఎం జ‌గ‌న్ మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వం కరోనాను జాతీయవిపత్తుగా ప్రకటించినా, అంత‌ర్జాతీయంగా దీంతో ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ ప్ర‌క‌టించినా జగన్‌ ప్రభుత్వానికి పట్టడం లేదని, ఎన్నిక‌లే త‌మ‌కు ప్ర‌ధాన‌మంటున్నాడ‌ని మండిప‌డ్డారు. 250 మంది త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని ఉన్న‌త ప‌ద‌వుల్లో కూర్చోబెట్టిన ఘ‌న‌త వ‌హించిన ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల క‌మిష‌న్‌కూ కులాన్ని ఆపాదించే ప్ర‌య‌త్నం చేయ‌టంపై ఎద్దేవా చేసారు. 

ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స్పీకర్‌ పదవికి తమ్మినేని సీతారామ్ జైకొట్ట‌డ‌మే కాక నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నార‌ని మండి ప‌డ్డారు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ వైసీపీ దౌర్జన్యాలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నార‌ని, చివ‌ర‌కి ఆత‌ని నోటి వెంట లంజ‌త‌నం కూడా వినాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని క‌నీసం ఏం మాట్లాడుతున్నమో అని విజ్ఞ‌త మ‌ర‌చిపోయిన‌ట్టుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. 

కొరోనా వైరెస్సా… క‌మ్మ వైర‌స్సా అంటూ స్పీక‌ర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ ప‌ద‌వికి ఆయ‌న అర్హుడేనా అనిపించ‌క మాన‌ద‌ని పంచుమర్తి విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published.