ఏడాదికి ముప్పై కోట్లు సంపాదన పోర్బ్స్ లో స్థానం @ సాయిపల్లవి


‘ప్రేమమ్’ సినిమాతో యూత్‌ను ఆకర్షించి.. అందర్నీ ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి   ఫోర్బ్స్లో చోటు దక్కించుకుంది.   ఫోర్బ్స్లో  ప‌త్రిక  30 ఏళ్ల లోపు ఉండి   అత్యధిక సంపాదన కలిగిన  ఇండియన్ యూత్ కు సంబంధించిన 30 మంది జాబితా విడుద‌ల చేయ‌గా అందులో సాయిపల్లవి మెరిసింది.  ఈ జాబితాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, సైన్స్, మీడియా, డిజైన్, ఫ్యాషన్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రంగాల్లో రాణించిన వారితో పాటు  యూ ట్యూబర్స్‌కు కూడా చోటు దక్కటం విశేషం. 

ఇటు టాలీవుడ్ తో పాటు  కోలీవుడ్, మల్లూవుడ్‌లోనూ  త‌న అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డే్స్తు,   తక్కువ సినిమాలు చేసినా  ఎక్కువ పారితోషికం అందుకుంటున్న ఈ అమ్మ‌డు గ‌త ఏడాదిలో  దాదాపుగా 30 కోట్ల వరకు ఆదాయం గ‌డించేసింద‌ని టాక్‌.  ఈ క్ర‌మంలోనే సాయిపల్లవి పోర్బ్స్ జాబితాలో చేరిందపి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెపుతున్న మాట‌.  ఇదండీ విష‌యం. 

Leave a Reply

Your email address will not be published.