బ్యాచిలర్ హీరో గూఢచర్యం

‘కర్మ’ సినిమాతో దర్శక రచయితగా, హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు ఎన్నారై అడివి శేష్. విదేశాల్లో ఫిలింమేకింగ్ కోర్స్ పూర్తి చేసి ప్రతిభావంతుడైన రచయితగా, దర్శకుడిగా ఆరంభమే సత్తా చాటాడు. తొలి చిత్రంతోనే హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరూ వెళ్లే దారిలో వెళ్లడం ఈ యంగ్ హీరోకి అస్సలు నచ్చదు. ఆ క్రమంలోనే తొలి సినిమా ‘కర్మ’తోనే ప్రయోగం చేసి ఆకట్టుకున్నాడు. అటుపైనా అతడిది అదే పంథా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ౠపంజాౠ కోసం పిలిచి మరీ అవకాశం ఇచ్చారంటే శేష్ ప్రతిభను గుర్తించడం వల్లనే. ఆ సినిమాలో ఓ డిఫరెంట్ షేడ్ విలన్ గా చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. బాహుబలిలోనూ పది నిమిషాల పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించాడు. మన దర్శకులు కేవలం క్యారెక్టర్లు మాత్రమే ఆఫర్ చేసి అతడి ప్రతిభను దాచాలనుకున్నారు. కానీ దాస్తే దాగేది ప్రతిభ కాదు. అందుకే ఆ తర్వాత శేష్ ఆ సంకెళ్లను తెంచుకుని బయటపడే ప్రయత్నం చేశాడు. ఆ ఎటెంప్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తనని బాక్స్లో బంధించాలని చూసిన వారికి సరైన సమాధానం చెబుతూ గూఢచారిగా డోర్స్ బద్ధలు కొట్టుకుని మరీ బయటకు వచ్చాడు. ప్రస్తుతం యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీకి డెబ్యూ నాయికగా అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు శేష్. 2 స్టేట్స్ రీమేక్ చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే సమంత ప్రధాన పాత్ర పోషించనున్న ‘ఎంత సక్క ంగున్నావే’లో శేష్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. అలాగే 2019లో గూఢచారి 2 రెగ్యులర్  చిత్రీకరణ ప్రారంభం కానుంది. మహేష్ ఈ చిత్రానికి నిర్మాత భాగస్వామి అన్న ప్రచారం సాగుతోంది. తాజాగా మరోసారి ఈనెల తర్వాత ఒక మంచి వార్త చెబుతున్నా.. అంటూ శేష్ ట్వీట్ చేయడం చూస్తుంటే అతడు చెప్పే గుడ్ న్యూస్ ఏంటో? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి వార్తనా?  లేక సినిమా సంగతో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.