అదిరే అభి హీరోగా ‘పాయింట్ బ్లాంక్’ చిత్రం


అదిరే అభి హీరోగా ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై   డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం పాయింట్ బ్లాంక్ . ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  బుధవారం ఉదయం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘జ‌బ‌ర్ద‌స్థ్” తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న అదిరే అభి హీరోగా పెద్ద‌తెర‌మీద సంద‌డి చేసేందుకు వ‌స్తుండ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్న అభి హీరోగా స్థానం అందుకుంటాడ‌ని, ఈ  ‘పాయింట్ బ్లాంక్’   పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

హీరో అదిరే అభి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా ఎవ‌రూ ఊహించ‌ని ట్విట్ల‌తో సాగుతుంది. హాలీవుడ్ స్థాయిలోని స్క్రీన్‌ప్లే ఆక‌ట్టుకోవ‌టం ఖాయం.  భార‌తీయ వెండితెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కురాని క్రైమ్ పాయింట్‌ని ఆధారంగా మ‌ల‌చిన ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరారు.  

చిత్ర నిర్మాత డా.కొన్నిపాటి శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ తొలి ప్రయత్నంగా  ఈ ‘పాయింట్ బ్లాంక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. కథనే హీరోగా ఎంచుకుని అదిరే అభిని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేయించడం జరిగింది. ఈ కథ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్నాము. షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈరోజు తలసానిగారి చేతుల మీదుగా టైటిల్ లోగో పోస్టర్‌ను విడుదల చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.