మూడ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా 3 రాజధానుల బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్ కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. ఈ రిపోర్టులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
అయితే మునుపెన్నడూ లేనంతగా ఈ సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీనికంతటికి కారణం ఒక్కటే. అమరావతి భవితవ్యం తేలే రోజు ఇది. పాలన వికేంద్రీకరణ వైపే ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షం మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణకైతే ఓకే గానీ.. పాలన వికేంద్రీకరణకు మాత్రం ఒప్పుకునే ప్రసక్తేలేదని అంటోంది. ఇంకోవైపు రాజధాని ప్రాంత రైతులు ఉవ్వెత్తున నిరసనలు, ఆందోళనలు, దీక్షలతో ఓరెత్తిస్తున్నారు.
అలాగే రాజధాని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఛలో అసెంబ్లీకి జేఏసీ, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు భారీగా పోలీస్ యంత్రాంగం మోహరించింది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు ప్రజల చూపంతా ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది.