జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన‌

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి శుక్ర‌వారం ఢిల్లీలో పర్యటన‌కు వెళ్ల‌నున్నారు. నిజానికి బుధ‌వారం రాత్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ బుధవారం, గురువారం నాడు షా బిజిబిజీగా ఉండటంతో అపాయిట్మెంట్ దొరక పోవ‌టంతో తిరిగి వ‌చ్చేసారు. 

అయితే షా  అపాయిట్మెంట్ శుక్రవారం నాటికి  దొరకటంతో తిరిగి ఢిల్లీ వెళ్లి   మూడు రాజధానులు, రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం నిధులు, శాసనమండలి రద్దు తీర్మానంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించే అవకాశాలు ఉన్న‌ట్టు పార్లీ వ‌ర్గాలు చెపుతున్న మాట‌. 

బుధ‌వారం  ప్ర‌ధాని మోడీతో జరిగిన భేటీలో జ‌గ‌న్ ఈ అంశాల‌ను  ప్రస్తావించగా. హోంమంత్రి. అమిత్ షా తో చర్చించాలని సూచించ‌డంతో  ఈ భేటీ అనివార్య‌మైంది.  . జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఢిల్లీ  వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.  

అయితే శుక్ర‌వారం ఆయ‌న కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉండ‌గా… విచార‌ణ‌ల‌కు హాజ‌రై వెళ‌తారా?  లేక ఇదే కార‌ణం చూపి విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా పోతారా అన్న మీమాంశ పార్టీ వ‌ర్గాల‌లోనూ క‌నిపిస్తోంది. 

 

Leave a Reply

Your email address will not be published.