ఏపి పెట్టుబడులు తెలంగాణకు తరలిపోతున్నాయి

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తే… జగన్ తుగ్లక్‌లా పాలన చేస్తుండటంతో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, సంస్ధలు తెలంగాణకు తరలిపోతున్నాయని టీడీపీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ దేశంలోనే బిలీనియర్‌గా ఉన్నరిలయన్స్ అధినేత అంబానీ ప్రారంభించాలనుకున్న కంపెనీ కూడా చంద్రబాబు బినామీ అంటూ వైసిపి ప్రచారం చేసిందని, తాము ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విశాఖ లో లూలు కంపెనీ ఏర్పాటుకు అన్ని సిద్ధం చేస్తే, తమకు ఆమ్యామ్యాలు ఇవ్వలేదన్న కసితో ఆ పార్టీ నేతలు లూలు కంపెనీ ని విశాఖ నుంచి తరిమేసే దాక నిద్రపోలేదని మండిపడ్డారు. ఇక్కడి పరిశ్రమలు తెలంగాణ తరలించేందుకు జగన్ కేసీఆర్‌ల మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేసారాయన.
3 రాజధానులను ఏర్పాటు చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైనా చెప్పారా’’ అని లోకేష్ జగన్‌ని ప్రశ్నించారు
3 రాజధానులు కాదు.. 33 రాజధానులను ఏర్పాటు చేసుకుంటామని ఓ మంత్రిగారు సెలవిచ్చారని, పసిబిడ్డ అమరావతిని 3 ముక్కలుగా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదేళ్లలో రైతులు ఎప్పుడైనా రోడ్డెక్కిన సందర్భం ఉందా? అని లోకేష్ ప్రశ్నించారు, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి కలిపించారన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నందుకు ఈ ప్రాంతంలో ఉన్న ఓ రైతుపైన 9 సెక్షన్లు పెట్టారంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చని నిలదీశారు. నిన్నటి వరకు ‘‘రావాలి జగన్.. కావాలి జగన్న్న నోళ్లు….. ఇప్పుడు పోవాలి జగన్.. మాకొద్దు జగన్ అంటున్న విషయం గమనించాలని సూచించారు.
రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసిపి మంత్రులు మాట్లాడుతున్నారని, జగన్ రైతు పండించిన అన్నం తింటున్నారా లేక ఇన్నాళ్లు నొక్కేసిన డబ్బు తింటున్నారా? అని ఎద్దేవా చేసారు. 11 మంది రైతులు చనిపోతే వైసీపీ నేతలు మాట్లాడని వారి నోళ్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతులు కడుపు మండి దాడి చేస్తే దానిని పెయిడ్ ఆర్టిస్టులే రాళ్లు వేశారని వక్రీకరిస్తున్నారని భగ్గుమన్నారు లోకేష్.