పోర్న్ వీడియోలు చూసేవారిపై నిఘా..! అత్యధిక సంఖ్యలో మహిళలుదేశంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలకు కాణాలేంట‌ని డేగ కన్నువేసిన తమిళనాడు పోలీసులు ఇందుకు పోర్న్ వీడియోలు చూడ‌ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే అత్యాచారాలను ప్రోత్సహించేందుకు కారణమైన పోర్న్ వీడియోల వెబ్ సైట్ల‌ను నిరోధించ‌డంతో పాటు అత్యాచారాల ఆలోచనకు బీజం వేసే పోర్న్ వీడియోలను వ్యతిగత ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయనే దానిపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఎవరు చూస్తున్నారు. వాటిని ఎవరు పోస్ట్ చేస్తున్నారు. వీటికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న వారెవ‌ర‌న్న విష‌యాల‌పై దృష్టి సారించారు. దీంతో ఈ పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్న వారిపై నిఘా పెట్టి వారిని గుర్తించారు. అయితే వీరిలో మ‌హిళ‌ల సంఖ్య కూడా అధికంగా ఉండ‌టంతో అంద‌రికీ కౌన్సిలింగ్ ఇచ్చే ప‌నిలో ప‌డ్డారు. పోర్న్ వీడియోలు చూస్తున్న వారితో పాటు వాటిని పోస్టు చేస్తూ నిర్వ‌హిస్తున్న వారిపైనా దృష్టి పెట్టిన పోలీసులు ఈ వీడియోలు చూస్తున్న వారి వివరాలు సేకరించారని సమాచారం. వీరులో గ్రూపుల‌ను ఏర్పాటు చేసుకుని మెసెంజ‌ర్ ద్వారా వీడియోల‌ను ప‌ర‌స్ప‌రం పంపుకుంటున్న వారున్న‌ట్టు పోలీసులు చెప్పారు. సుమారు మూడు వేల మంది చిరునామాలు కనుగొన్నామ‌ని, వీరిలో ఇప్ప‌టికే కొంతమందిని అరెస్ట్ చేశామ‌ని చెపుతున్నారు త‌మిళ‌నాడు పోలీసులు.హైదరాబాద్‌లో దిశ అత్యాచారం, హ‌త్య‌ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలులో ప్ర‌భుత్వాలు మహిళల రక్షణకు నడుం బిగించాయి. త‌మిళ‌నాడులో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెన్నైలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం చెపుతోంది. పోర్న్ వీడియో చూస్తే సంబంధిత వ్య‌క్తి చిరునామా ఇట్టే ప‌సిగ‌ట్టేస్తామ‌ని, స‌ద‌రు ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఆధారంగా వారిని అరెస్టు చేస్తామ‌ని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.