‘మేడం టుస్సాడ్స్‌’ మ్యూజియంలో స్థానం సంపాదించిన కాజల్అందాల ముద్దుగుమ్మ కాజల్ తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధలను చేశారు.  ఆమె అందానికి ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు.  యూత్‌లో మంచి ఫాలోయింగ్‌తో  ఉన్నారు. ఆమె చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా రేపు ప్రఖ్యాత సింగపూర్‌ మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ అగర్వాల్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  ఈ క్రమంలో కాజల్‌ వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్స్‌కి చేరవేసింది. 
తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్‌ లో ఆవిష్కరిస్తున్నందుకు  కాజల్ తెగ సంతోషిస్తుంది. ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు చిత్రసీమకు సంబందించి మహేష్‌ బాబు, ప్రభాస్‌ వంటి నటుల విగ్రహాలు ఉన్నాయి.  ఈ విగ్రహాలతో పాటు బాలీవుడ్ నుంచి అమితాబ్‌, హృతిక్‌ రోషన్‌ , కాజోల్‌, కరీనా కపూర్‌ వంటి పలువురు నటీనటుల మైనపు విగ్రహాలను అక్కడ ఆవిష్కరించారు.  కాజల్‌ ప్రస్తుతం కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో వస్తున్న భారతీయుడు 2 లో కూడా కథానాయికగా మెరవనుంది. తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలోనూ నటిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.