వేసవి లోరానున్న `ఆకాశం నీ హద్దురా`

తమిళ హీరోల్లో అగ్రగణ్యుడిగా విభిన్న చిత్రాలు చేసే సూర్య తెలుగులోనూ చాలా పాపులర్. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై సంచలనం సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కొన్ని చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకున్నా ఆతని సినిమా విడుదలవుతోందంటే ఉత్కంఠగా ఎదురు చూస్తారు సినీ జనాలు.
తాజాగా ఆయన వేసవికి `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతుండగా ఆపై అసురన్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలోఓ సినిమా చేయబోతున్నారు. తమిళ నాట సంక్రాంతి వచ్చిందంటే జరిగే జల్లికట్టు పోటీల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి `వాడివాసల్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాసల్ అని తమిళులు పిలుచుకుంటారు.
ఇదే టైటిల్‌తో ప్రముఖ తమిళ రచయిత సీఎస్.చెల్లప్ప రాసిన నవల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఇంతవరకు తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాని వెట్రిమారన్ ఎలా తెరకెక్కించబోతున్నాడన్నది చూడాలి.