భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు సిద్ధం కండి –కలక్టర్ ఆర్వీ కర్ణన్

నేలకొండపల్లి, డిశంబర్ 4
జనవరి చివరి వారంలో జరుగు భక్తరామథాసు జయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు బుధవారం మండల కేంద్రంలోని భక్తరామథాసు ద్యానమందిరాన్ని కలక్టర్ సందర్శించి  అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ భక్తరామథాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ఆడిటోరియం పనులు ప్రారంబించాలన్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అలాగే భద్రాచలం లో ఉన్న విగ్రహాలను పోలిన విగ్రహాలను ధ్యాన మందిరంలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు భక్తరామథాసు ద్యానమందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ఓపెన్ ధియేటర్ నిర్మించాలని ఆదేశించారు జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం అరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, ఎంపిపి వజ్జా రమ్య, ఎంపిడిఓ బి రవి, తహసీల్దార్ స్వాతి బిందు, ఆర్ ఐ రమేష్, ఏఓ నారాయణ రావు, ఏపిఓ సునీత.,నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి  నవీన్ కుమార్, ఉపసర్పంచ్ లక్కం ఏడుకొండలు విద్వత్ కళాపీటం చైర్మన్ సాదు రాధాకృష్ణ మూర్తి, భక్తరామథాసు ద్యానమందిరం అర్చకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.