పెళ్లిపై ఎందుకీ సందిగ్ధత ?


టాలీవుడ్‌లో ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌కి కొదవేం లేదు. ప్రభాస్, రానా,  నితిన్,  విజయ్ దేవరకొండ .. ప్రస్తుతం క్యూలో ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?  పదే పదే అభిమానులు, మీడియా నుంచి ఎదురయ్యే ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా అయినా ప్రభాస్ పెళ్లి గురించి ఏదైనా క్లూ దొరుకుతుందనే భావించారు. కానీ దీనిపై పెదనాన్న దాటవేశారు. అయితే మీడియా జనం మాత్రం సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి కబురు అందే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి రిలీజ్ తర్వాత పెళ్లాడుతానని ప్రభాస్ అన్నాడు. ఐదేళ్లకు బాహుబలిని పూర్తి చేసినా, ఆ వెంటనే సాహో మొదలు పెట్టేయడంతో పెళ్లి గురించి ఆలోచించలేదు. ఈ సినిమా పేరుతో మరో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి.  ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న ప్రభాస్ కంగారు పడుతున్నారు.. అన్నిటికీ సమాధానం ఆగస్టు తర్వాతనే ఉంటుందేమో అన్న చర్చ సాగుతోంది.  భళ్లాల దేవ రానా ఎప్పుడు పెళ్లాడుతాడు? అన్నదానిపైనా ప్రశ్న తప్పడం లేదు. ఇటీవలే కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. త్రిషతో ఎఫైర్ గురించి ప్రశ్నించారు. కానీ దేనికీ సరైన ఆన్సర్ లేదు. పెళ్లెప్పుడంటే ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. టాలీవుడ్‌లో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.  నితిన్ ఓ యువకథానాయికతో ప్రేమలో పడ్డారని వార్తలొచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత ఖండించారు. పెళ్లిపై ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. మరో రైజింగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిపైనా స్పష్టత లేదు. పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే దానికి ఇంకా సమయం ఉంది. కెరీర్ పైనే  దృష్టి అని ఇదివరకూ అన్నాడు. ఇక విదేశీ గాళ్ ఫ్రెండ్ తో ఎఫైర్ అంటూ సాగిన ప్రచారంలో నిజం ఎంతో తెలియాల్సి ఉందింకా.

Leave a Reply

Your email address will not be published.