ఆర్ ఆర్ ఆర్‌లో యాక్ష‌న్‌, రొమాన్స్ రెండూ అదుర్స్‌!


ఎన్టీఆర్… రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాపై అంచనాలను పెంచుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జోడిగా విదేశీ హీరోయిన్ ఒలీవియా నటిస్తోంది. రామ్ చరణ్… అలియాపై ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేశారని సమాచారం.

రామ్ చరణ్.. అలియాల మధ్యే కాకుండా, ఎన్టీఆర్ – ఒలీవియా మధ్య కూడా అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్ ను రాజమౌళి రీసెంట్ గా షూట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ తో పాటుగా రొమాన్స్ కూడా సూపర్ గా ఉంటుందని తెలుస్తోంది. వరసగా ఇలాంటి న్యూస్ బయటకు వస్తుండటంతో సినిమాపై రోజు రోజుకు అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి.  

రీసెంట్ గా లీకుల బారిన పడ్డాడు జక్కన్న. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను లీడ్స్ లో పెట్టి తెరకెక్కిస్తోన్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ ఈ చిత్రం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published.