అమ‌ధ్య కాలంలో పెట్రోల్ బంకుల‌లో ప్రమాదాలు

అమ‌ధ్య కాలంలో  పెట్రోల్ బంకుల‌లో ప్రమాదాలు జరగటం సర్వసాధారణమైపోయింది. పెట్రోల్ పంపిణీ సంస్ధ‌లు బంకుల నిర్వాహ‌కుల‌కు ఎన్ని హెచ్చ‌రికలు చేస్తున్నా నిర్ల‌క్ష్యం వాహ‌న‌దారుల పాలిట శాపంగా మారుతోంది. అయితే  వాహనదారులు కూడా పెట్లోల్ బంకుల‌కు వ‌చ్చేప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని   డీజిల్ గాని పెట్రోల్ గాని ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు  ఏమరుపాటుగా లేదా అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప‌లు ఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చూపుతూ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

 ఫిల్లింగ్ స్టేషన్లలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం స‌రికాద‌ని హెచ్చ‌రిక‌లు ఉన్నా బిల్ పేమెంట్‌తో పాటు ఫోన్ల‌లో అప్పుడే అత్య‌వ‌స‌రాలున్న‌ట్టు మాట్లాడ‌టం మ‌నం చూస్తున్నాం. దీంతో  ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న‌ట్టుంద‌న్న‌ది అగ్నిమాప‌క అధికారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కూడా ప్రమాదాలు జరగుతుంటాయ‌ని, వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ మ‌ధ్య    పెట్రోల్ నింపుకునేందుకు ఫిల్లింగ్ స్టేష‌న్‌కి వెళ్లిన‌ డ్రైవర్ కారు ఇంధనాన్ని నింపే వ్యక్తితో మాట్లాడుతూనే ఫోన్‌ని ఆన్ చేసాడు. అంతే ఒక్క‌సారిగా  ఫ్యూయల్ క్యాప్ నుండి మంటలు చెలరేగి కారును కాస్త‌ ద‌గ్ధం చేసింది.అక్కడ ఉన్న ఫైర్ అటెండర్ మంటలను ఆర్పే య‌టం,  డ్రైవర్ ప్రమాదం నుంచి బయట పడిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

సాధారణ వాతావరణంలో స్థిర విద్యుత్  పాజిటివ్ – నెగటివ్ చార్జెస్ వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సంభవించి విడుదలవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయ‌ని నిపుణులు చెపుతున్నారు.    అరుదైన సందర్భాలలో ఫిల్లింగ్ స్టేషన్స్ లో ఈ స్థిర విద్యుత్ పుట్టి మంటలు చెలరేగుతాయని,  పెట్రోల్ బంక్‌కి వెళ్లినప్పుడు వాహనాన్ని దిగి పెట్రోల్ కొట్టించుకోవాల‌ని పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో సూచిక‌లు ఉన్నా, దానిని అటు వాహ‌న‌దారులు కానీ, ఇటు య‌జ‌మానులు కానీ ప‌ట్టించుకోక పోవ‌టం వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది మాత్రం నిజం.

 అలాగే ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు త‌గ‌ల బ‌డుతుండ‌టం చూస్తున్నామ‌ని,  రోడ్ల‌పై వేగంగా వెళుతూ ష‌డ‌న్ బ్రేకులు వేసేప్పుడు  టైర్లు – రహదారుల మధ్య జ‌రిగే రాపిడి కూడా  వాహ‌నాల‌పై ప్ర‌భావం చూపి  ప్రమాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని ఫైర్‌సిబ్బంది చెప్పారు. ఎక్కువగా ట్రక్కులు , కార్లు, బస్సులకు ఈ త‌ర‌హా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని,  వాహనదారులు మరింత జాగ్రత్తగా త‌మ‌ వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కాగా పెట్రోల్ బంకులకు వెళ్లే వాహ‌న‌దారులను  యాజ‌మాన్యాలు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తూ వ్య‌వ‌హ‌రించాలంటూ కొన్ని సూచ‌న‌లు చేసారు అగ్నిమాప‌క సిబ్బంది.
ఇంధ‌నం నింపుకునేందుకు బంక్‌లకి వ‌చ్చ వాహ‌నాల‌ను నిలిపి కొంత దూరంగా నిలబడమ‌ని చెప్పాలి.. ఎందుకంటే అనుకోని ప్రమాదాలు సంభవిస్లే ప్రాణాలుకోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చ‌రించాలి.
ఇంధనం నింపిన తరువాత అక్కడి నుంచి తీసుకెళ్లాల‌ని సూచించాలి.
ఫ్యూయల్ గొట్టం  వాహనం లోపలి వ‌ర‌కు ఉండకుండా తాటిష్ఠంగా ఉండేట్లు చూసుకోవాలి.
మొబైల్ మాట్లాడటం కాని, స్మోక్ చేయడం వంటివి కానీ తప్పని సరిగా నివారించాలి.

Leave a Reply

Your email address will not be published.