సీనియ‌ర్ కంటే జూనియ‌ర్ గొప్ప కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని తాజాగా  ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌ ను తక్కువ చేసి మాట్లాడినట్టు సోషల్ మీడియాలో చర్చ రేగింది. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తనకన్నా చాలా చిన్నవాడని చెప్పిన నాని ఇద్దరి మధ్య 11 నుంచి 12 ఏళ్ల తేడా ఉందని అన్నారు. అతన్ని చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినట్టు ఉంటుందని చెప్పారు. అలాగే ‘‘ఇది చెప్పకూడదేమో.. ఎందుకంటే తిడతారు.

పెద్ద ఎన్టీఆర్ నటన చూశా, ఆయన డ్యాన్సులు చూశా, ఆయన హావభావాలు చూశా. ఆయన కన్నా గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. నేను చెప్పేది వాస్తవం. ఎన్టీ రామారావు గారి కన్నా మంచి నటుడు తారక్. ఆయన కొన్ని పాత్రలకు బ్రహ్మాండంగా సెట్ అవుతారు. కొన్నిటికి ఆయన సెట్ అవ్వర‌ని అన్నారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్‌కి సినిమా స్క్రీన్‌పై ఎదురులేదు. డ్యాన్స్ దగ్గర నుంచి ఏదైనా చేయగలడు. ఏ పాత్రనైనా చేయగలిగే సత్తా ఉన్న స్టార్’’ అని జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నాని. ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ర‌న్నారు. అయితే ఈ విషయం మీద నాని మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమతో ఎలివేషన్ కోసం మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదంగా మారతాయేమో ?

ఇక ఈ విష‌యం ఇలా ఉంటే ఒక ర‌కంగా చ‌ప్పాలంటే అప్ప‌ట్లో ఎన్టీఆర్‌ని మ‌హానాయ‌కుడు అనేవారు అలాగే మ‌హాన‌టుడు కూడా. ఇప్ప‌టి ట్రెండ్‌ని బ‌ట్టి ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫాలోఅవుతున్నారు. అంతే ఎప్ప‌టి ట్రెండ్‌ని అప్పుడు హీరోలు ఉంటారు. జూనియర్‌ ఎన్టీఆర్ ఇటీవ‌లెవిశాఖ వెళ్ళిన విష‌యం తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published.