‘రాహు’ శాటిలైట్, డిజిటల్ హాక్కులు దక్కించుకున్న ‘జి తెలుగు’
టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో    థ్రిల్లర్ మూవీగా రూపొందిన చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని,  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటోంది. మార్చి నెల‌లో విడుద‌లకు సిద్ద‌మువుతున్న రాహు  శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లు కు అమ్ముడుకావ‌టం విశేషంగా చెప్పాలి.  చిన్న సినిమాలకు శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం అనేది గగనంగా మారిన  త‌రుణంలో ఈ సినిమా విడుదలకు ముందే  అమ్ముడవడంతో  సినిమా పై అంచనాలను పెంచేలా చేసింది. ఈ శాటిలైట్ హ‌క్కులు జి తెలుగు తీసుకున్న సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు  సుబ్బు వేదుల మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ: గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా విడుదలకు ముందే అందరి అటెన్షన్ కి లోను చేస్తున్న మా ‘రాహు శాటిలైట్, డిజిటల్ హాక్కులు జి తెలుగు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్నారు. 

కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవుతున్న త‌రుణంలో  జిటివి తెలుగు ఛాన‌ల్ యాజ‌మాన్యం సినిమా పై మాకున్న నమ్మకం మరింత పెంచేలా చేసింద‌ని అన్నారు.   రాహు లో సిధ్ శ్రీరామ్ పాడిన ‘ఎమో ఎమో’ పాట 7 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంద‌ని, ఈ పాట ‘రాహు’ కి ప్రత్యేక ఆకర్షణగా మారింద‌ని చెప్పుకొచ్చారు.  ఇక ఈ థ్రిల్ల‌ర్ మ‌వీకి  ప్రవీణ్లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  పెద్ద అసెట్ గా మారిందని, మా రాహు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుతెర‌పై వ‌చ్చిన‌. థ్రిలర్స్ ని మించి   కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తుంద‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published.