రేష‌న్ కార్డు అడిగిన మ‌హిళపై చిందులేసిన వైసీపీ ఎమ్మెల్యే

పనులు కావాలంటే బతిమాలుకోవాలి.. అంతేకానీ బెదిరిస్తే‌‌.. బెదిరేవాళ్లు ఎవరు లేరని మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా అడగాలో తెలియకపోతే ఇబ్బందిపడతావంటూ మహిళను పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌.. హెచ్చరించారు. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం సచివాలయం భవనం వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది.  వివ‌రాల‌లోకి వెళితే . రేషన్‌కార్డు ఇవ్వాలంటూ అమె.. ఎమ్మెల్యే చేతులు పట్టుకుని ప్రాధేయపడింది. రేషన్‌కార్డు అడిగిన మహిళపై బె ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌.. చేయి వదులు అంటూ తీవ్ర స్వరంతో మందలించారు.  ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడ‌మే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డటంపై మండిప‌డుతున్నారు జ‌నం.

Leave a Reply

Your email address will not be published.