ఎందుకీ గ్యాప్? ఫ్యాన్స్‌లో ఆవేదన!

సౌత్ సహా బాలీవుడ్‌లో మాంచి జోష్‌లో ఉన్నప్పుడు అనూహ్యంగా సినిమాల నుంచి వైదొలగింది శ్రుతిహాసన్. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ రెండేళ్లుగా సినిమాలు అంగీకరించడం లేదు. పూర్తిగా నటన మానేసి సంగీతం వైపు అడుగులు వేస్త్తోంది శృతిహాసన్. సినిమాల్లోకి రాకముందే ఈమె గాయకురాలిగా పేరు తెచ్చుకుంది. కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమాకు సంగీత దర్శకురాలిగా కూడా పని చేసింది. ఇక సినిమాలు మానేసి.. హాయిగా రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాలని ఆ మధ్య ఫిక్సయిపోయింది శృతి హాసన్. తన టీం మొత్తాన్ని సిద్ధం చేసుకుని స్టేజ్ షోలు కూడా ఇవ్వడానికి రెడీ అయింది.
ఆ మధ్య విదేశీ టూర్లు ప్లాన్ చేసింది. వరసగా మ్యూజిక్ ప్రిపరేషన్స్‌లోనే బిజీగా ఉన్న శృతి కాటమరాయుడు తర్వాత తెలుగులో ఈమె సినిమా ఏదీ ఒప్పుకోలేదు. రెండేళ్ల కింద వచ్చిన బెహన్ హోగా తేరీ తర్వాత శృతి పూర్తిగా సినిమాలకు దూరం అయింది. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నా కూడా అది కూడా కుదరలేదు. సాహో లాంటి సినిమాను కూడా ముందు శృతినే అడిగినా ఆమె కాదందని టాక్ ఉంది పరిశ్రమలో. ఎందుకీ గ్యాప్ అంటూ అభిమానుల్లో ఆవేదన నెలకొన్న వేళ సరైన ఆన్సర్‌నే రెడీ చేసింది శ్రుతి. త్వరలో విజయ్ సేతుపతి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందిట. జయంతన్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించనున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ.

Leave a Reply

Your email address will not be published.