మ‌రోసారి ఆ పాత్ర‌లో న‌టిస్తున్న‌ నాగ్ ?


నాగార్జున చిత్రాలంటే ఇప్ప‌టికీ అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుంది. రొమాంటిక్ చిత్రాల‌కు పెట్టింది పేరు నాగ్. అయితే  ఆయ‌న న‌టించిన గ‌త చిత్రం `మ‌న్మ‌థుడు 2` మాత్రం ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న ఓ కొత్త దర్శకుడుతో  యాక్షన్‌ థ్రిల్లర్‌ చేబోతున్నాడు. అందులో ఈయన పోలీస్‌గా కనిపించబోతున్నాడ‌ని స‌మాచారం. వయసు మళ్లిన పోలీస్‌గా అంటే త్వరలోనే ఉద్యోగ విరమణ చేయబోతున్న వ్యక్తిగా ఇందులో నాగార్జున మెప్పించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఓ ముఖ్యమైన ఆపరేషన్‌ ఈయన చేతుల మీదుగా సాగుతుందట.

ఇక ఇందులో చాలా యంగ్‌ స్టార్స్‌ నటించబోతున్నారట. ఈ యువకుల జట్టుకు నాగ్‌ నాయకుడిగా ఉండబోతున్నాడు. రచయిత సోలోమన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందున్న ఈ చిత్రంలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను అంతర్జాతీయ ఫైట్‌మాస్టర్స్‌తో చేయించబోతున్నార‌ని స‌మాచారం.  వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. మన్మథుడు 2 తర్వాత నాగార్జున చేస్తున్న సినిమా ఇదే. అయితే అలాగే బాలీవుడ్ లో  అమితాబ్‌తో క‌లిసి బ్ర‌హ్మాస్త్ర‌లో ఓ కీల‌క పాత్ర‌లో కూడా క‌నిపించ‌బోతున్నారు. అందులో నిడివి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్య ఉండడంతో ఆయ‌న అందులో చేయ‌డానికి ఒప్పుకున్నారు.

ఇక నాగార్జున పోలీస్ ఆఫీప‌ర్‌గా గ‌తంలో కూడా కొన్ని చిత్రాల్లో న‌టించారు.  అయితే ఆయ‌న ఆ పాత్ర‌లో `ర‌క్ష‌ణ‌`, `ఆవిడా మా ఆవిడే`, `ఆఫీస‌ర్‌`, చిత్రాల్లో న‌టించారు.


Leave a Reply

Your email address will not be published.