మరో టీజర్ తో వచ్చేసిన ‘డిస్కోరాజా’

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం తో వస్తున్న ‘డిస్కోరాజా’ ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను .. ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది” అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆరంభమైంది. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని పలు సన్నివేశాలతో రూపొందించిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో నభా నటేశ్, పాయల్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తుండటంతో సినిమా మరింత ఆకర్షణీయంగా మారిందన్నది నెటిజన్లు చెపుతున్నామాట.