రేపు ’సరిలేరు నీకెవ్వరు’ నుంచి సూర్యుడివో చంద్రుడివో…


సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం’సరిలేరు నీకెవ్వరు’.
డిశంబ‌ర్‌లోని ప్ర‌తి సోమ‌వారం ఒక్కో పాట విడుద‌ల చేయాల‌ని ’సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ మైండ్ బ్లాక్’ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత `సరిలేరు నీకెవ్వరు`చిత్రం నుండి రెండో పాట‌గా సూర్యుడివో చంద్రుడివో… సోల్ ఫుల్ మెలోడీ ని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలచేయనుంది చిత్ర యూనిట్.
సంక్రాంతి కానుకగా జనవరి11నప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది
.

Leave a Reply

Your email address will not be published.