రోడ్డు భద్రత విషయంలో హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు….


హాట్ హాట్‌గా క‌నిపించే న‌టి ఈషా రెబ్బా తెలంగాణ ఓ మంత్రి తో క‌ల‌సి ద్విచ‌క్ర వాహ‌నం పై చ‌క్క‌ర్లు కొట్టి ఔరా అనిపించింది. మీరేదో ఊహించేసుకునేరు. మంగ‌ళ‌వారం నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్న ర‌హ‌దారి భద్రతా వారోత్సవాలను హైదరాబాద్‌లో ఆరంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఇందులో బాగంగా ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్ పెట్టుకోవాల్సిన బాధ్య‌త‌ని ప్ర‌చారం చేసేలా ఆయ‌న రాయల్‌ ఎన్ఫీల్డ్ వాహ‌నం న‌డిపేందుకు సిద్ద‌మైతే ఏం చ‌క్కా త‌నూ ఓ హెల్మెట్ పెట్టుకుని మంత్రి అజయ్ వెనుక ఈషా రెబ్బా ఎక్కి కూర్చొన‌టంతో ఆయ‌న హూందాగా బైక్ న‌డిపించారు. మంత్రి పువ్వాడ అజయ్, తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా ఈ బైక్ రైడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈషా రిబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిల‌చిన‌. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానీయ, హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జనాభాకు ధీటుగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండ‌టంతో నిబంధ‌న‌లు పాటించని వారిసంఖ్య కూడా పెరిగింద‌ని, వాహ‌న దారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రపంచం లోని వాహ‌నాల‌తో లెక్కిస్తే, మ‌న‌కున్న వాహనాలు కేవ‌టం ఒక్క శాతమే అయిన‌ప్ప‌టికీ ప్రమాదాలలో మాత్రం మ‌నం 11 శాతం జరుగుతున్నాయని అన్నారు. గ‌త‌ ఏడాది తెలంగాణాలో 22 వేల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగితే వాటిలో 6,600 మంది చనిపోయారని , వేగ నియంత్రణకు రహదారులపై రబ్బరు వేగనిరోధకాలను వినియోగించేలా ఏర్పాట్లు ముమ్మ‌రంచేస్తున్న‌ట్టు చెప్పారు. 

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.