ద్విపాత్రాభిన‌య‌నం లో ప్రేక్ష‌కుల ముందుకు మాస్ మ‌హారాజా….


మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రోమారు ద్విపాత్రాభిన‌య‌నంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు క‌నిపిస్తోంది. వీర లాంటి అట్ట‌ర్ ఫ్లాప్‌ సినిమా ఇచ్చిన‌ త‌ర్వాత కూడా రమేశ్ వ‌ర్మ చెప్పిన క‌థ‌కు ఇంప్రెస్ అయిన ర‌వితేజ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా కాల్షీట్లు ఇవ్వ‌టం విశేషంగా చెప్పుకుంటున్నారు సినీ జ‌నాలు. హ‌వీష్ నిర్మించే ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల వేట జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు పేర్లు గ‌మ‌నంలోకి తీసుకున్న‌ప్ప‌టికీ పూజా హెగ్డే, అంజ‌లిల పేర్ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌ని తెలుస్తోంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ర‌వితేజ విల‌న్ త‌ర‌హా పాత్ర‌ క‌నిపించ‌బోతున్నాడంటూ తెలియ‌వ‌చ్చింది. 


విక్ర‌మార్కుడు, రీసెంట్‌గా విడుద‌లైన డిస్కోరాజా వంటి చిత్రాల త‌ర్వాత ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుండ‌టంతో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ .. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ చిత్రంలో న‌టిస్తుండ‌గా. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను మే 8న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.