టీకాలతోనే ఆరోగ్యమంటున్న డాక్టర్లు

అయినదానికి కానిదానికి ఓ యాంటి బయోటిక్ వేసుకోవటం, కాసింత నలత తీరగానే దానివల్లే తగ్గిందన్న భావనతో వాటిని వాడేస్తుండటం అలవాటై పోయింది అందరికి . ఏదైనా రోగం వస్తే త్వరగా తగ్గిపోవాలన్నా ఆశతో ప్రతి చిన్న దానికీ యాంటీ బయోటిక్స్ మింగేస్తున్నారని, ఇది ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య రంగ నిపుణులు.
కాలాను గుణంగా వచ్చే జలుబు, జ్వరం లాంటివి రెండు మూడు రోజులుండి తగ్గిపోతుంటాయని, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా అలాంటివేనని, అయితే ఇవి త్వరగా తగ్గాలనే ఆత్రుతతో జనాలు యాంటీ బయోటిక్స్ తెగ వాడేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న దానికీ యాంటీ బయోటిక్స్ వాడేస్తున్న జనాలు పెద్దపెద్ద రోగాలతో ఆసుపత్రికి వస్తే అక్కడ ఇచ్చే యాంటీ బయోటిక్స్ పనిచేయడం లేదన్న ఆందోళన వ్యక్తం చేసారు పలువురు డాక్టర్లు. ఈ టాబ్లెట్స్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో సారి వైద్యం అందే సందర్భంగా రివర్స్ అవుతున్నాయని అన్నారు.
ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ అమ్మకూడదు, ప్రజలు వాడకూడదని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం చెపుతున్నా మెడికల్ షాప్స్ నిర్వాహకులు కూడా ప్రిస్కప్షన్ లేకుండా ఇష్టమొచ్చినట్లు యాంటీ బయోటిక్స్ విక్రయిస్తున్నారని తద్వారా వైద్య పరీక్షలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఫార్మా కంపెనీలతో లాలూచీపడి యాంటీ బయోటిక్స్‌ను ఎక్కువగా రాస్తున్న డాక్టర్లు కూడా లేకపోలేదని చెపుతున్నారు. ఈ యాంటీ బయోటిక్ వాడకం తగ్గించాలంటే టీకాలే మార్గమని డాక్టర్స్ చెపు న్నారు. టీకాలతో సీజనల్ వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చని అంటున్నారు. యాంటీ బయోటిక్స్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే వ్యాక్సిన్స్ వేసుకోవడం బెటర్ అంటున్నారు.