ఈ ఏడాది పెళ్లి ?

యంగ్ హీరో హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగిస్తూ ఖడ్గం ఫేం కిమ్ శర్మ వాడి వేడిగా చర్చల్లో కొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జోడీ పబ్లిక్ గానే తమ ఎఫైర్ ని అంగీకరించారు. ఇటీవల ఓ సినిమా సెట్స్ లో తమ మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందని ఈ జంట అంగీకరించారు. ప్రస్తుతం ఈ జోడీ సహజీవనంలో ఉన్నారు. ఆ క్రమంలోనే బాలీవుడ్ మీడియా ఫోకస్ అంతే ఇదిగా ఉంది. వాస్తవానికి కిమ్ శర్మ అలీ పుంజనీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడి, అటుపై రెండేళ్లయినా గడవక ముందే అతడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ మొదలైంది. ఇటీవలే ఓ విమానాశ్రయంలో ఒకరికొకరు సెండాఫ్ చెప్పుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా కిమ్ ఓ వెకేషన్ నుంచి బికినీ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ థాయ్ ల్యాండ్ వెకేషన్ లో ఉంది. అక్కడి నుంచే లైవ్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. అయితే అక్కడ తనతో పాటే హర్షవర్ధన్ రాణే మిస్సయ్యారే అంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం బికినీ గాళ్ హాట్ లుక్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇక ప్రియుడు హర్షవర్ధన్ రాణే సినీ కెరీర్ కంటే కిమ్ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో రేసులో వెనకబడిపోయాడన్న మాటా వినిపిస్తోంది. కిమ్  హర్షవర్ధన్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published.