హోలీ పండుగకు దూరంగా ఉందాం

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్న తరుణంలో ఈ ఏడాది హోలీ పండుగకు దూరంగా ఉండటమే సహేతుకమని అన్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు హోలీ మిలన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
గుంపులు, గుంపులుగా ఉండటం వల్ల కరోనా విస్తరించే ఆస్కారంఉంది కనుక హోలీ పండుగను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. . కరోనా వైరస్ వ్యాపించకుండా చూసేందుకు పెద్ద సంఖ్యలో సమావేశం కావడం గుంపుగా ఉండడం వంటివి చేయకూడదని ప్రపంచంలోని పలువురు నిపుణులు సలహా ఇస్తున్న నేపథ్యంలో తను ఈ సంవత్సరం హోలీకి దూరంగా ఉంటానని, అలాగే హోలీ పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు హాజరుకావద్దని నిర్ణయించుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు సైతం హోలీ పండుగకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో హోలీ పండుగ రావడంతో కరోనా వైరస్ రావడంతో ఈ ప్రభావం ప్రజల మీద చూపించే ఆస్కారం ఉందన్నది ఆరోగ్య నిపుణుల వాదన.