రేపు ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ- బాబు రాక

రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుబడుతూ అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు, ఆందోళనలకు మద్దతుగా ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో తెలుగుదేశం పార్టీ బస్ యాత్రను చేపట్టగా పోలీసులు వాటిని అడ్డుకుని దేశం నేతలను గృహ నిర్భందాలు, అరెస్టులు చేస్తున్నారు. అయితే రైతులకు మద్దతుగా నిలిచిన అఖిలపక్ష పార్టీలు తమ గళాన్ని వినిపిస్తు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించనుంది.
ఇందులో భాగంగా అమరావతి జేఏసీ సారధ్యంలో రేపు రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభని నిర్వహించేందుకు టిడిపి ఏర్పాట్లని ముమ్మరం చేస్తోంది. ఈసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటున్నట్టు టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప మీడియాకు చెప్పారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద జరగనున్న సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారపి, ప్రజలు భారీగా ఈ సభకు తరలి రావాలని, తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.