దేశ‌భ‌క్తి కాకెత్తుకెళ్లిందా?

ఒకప్పుడు దేశభక్తి సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అంతా జీరో. లవ్ స్టోరీలు – హారర్ – క్రైమ్ థ్రిల్లర్లపై ఉన్న మోజు దేశభక్తి సినిమాలపై లేనేలేదు. మన ఫిలింమేకర్స్ దృష్టి వాటిపై పడిన సందర్భమే కనిపించడం లేదు. అప్ప‌ట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను నటించే ప్రతి సినిమాలో దేశభక్తిని చాటే – స్ఫూర్తిని రగిలించే ఏదో ఒక అంశాన్ని తప్పనిసరిగా జోడించేవారు. మేజర్ చంద్రకాంత్ – ఆజాద్ – కాలాపాని – భారతీయుడు సహా ఎన్నో దేశభక్తి ప్రధాన చిత్రాలు వచ్చి టాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. కానీ ఇటీవలి కాలంలో అలాంటి ప్రయత్నమే  లేదు. ఆ తరహా కథల్ని మన దర్శకరచయితలు తయారు చేసుకుంటున్నారా? అంటే సందేహ‌మే. కార్గిల్ వీరుల కథల్ని – యూరి ఎటాక్స్ కథల్ని బాలీవుడ్ వాళ్లే తీస్తున్నారు. టాలీవుడ్ లోనూ తీయగలిగే సత్తా ఉన్న దర్శకులు ఉన్నా.. అలాంటి యూనివర్శల్ యాక్సెప్టెన్సీ ఉన్న కథల్ని ఎందుకు ఎంచుకోరు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఇటీవలే దేశభక్తి కథాంశంతో `యూరి (యుఆర్ ఐ) :  ది సర్జికల్ స్ట్రైక్స్` వచ్చి 300కోట్లు వసూలు చేసింది. దీని సీక్వెల్ గా `యూరి:  ది సర్జికల్ స్ట్రైక్స్ 2` తీసే ఛాన్సు ఉందని అర్థమవుతోంది. తాజాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు భారత వైమానిక దళం చేసిన సాహసంపై కథాంశం రెడీ చేసేందుకు `యూరి` టీమ్ ప్రిపేరవుతోంద‌ట‌.
ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో తీయలేరా? తీసే సత్తా లేనే లేదా? మన దర్శకరచయితలు – నిర్మాతల్లో దేశభక్తి లేదా? ఇండియా నంబర్ 1 (దేశీ వసూళ్లలో టాప్) సినిమా `బాహుబలి 2`ని అందించిన ఎస్.ఎస్.రాజమౌళికి క‌ష్ట‌మా?  ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఆ తరహానే అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు అడ‌వి శేష్‌- మ‌హేష్ క‌లిసి `మేజ‌ర్‌` అనే చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ముంబై దాడుల నేప‌థ్య ంలో సాహ‌స‌వీరుని క‌థ‌తో తెర‌కెక్కుతున్న‌ చిత్ర‌మిది.

Leave a Reply

Your email address will not be published.