హైద‌రాబాద్‌లో సైరాను ద‌ర్బార్ బీట్ చేసిందా?


సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఆదిత్య అరుణాచలంగా  ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కించారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న తెలుగులో విడుద‌ల చేశారు.

`సైరా` చిత్రం హైదరాబాద్ లో 749 షోస్ పడ్డాయి మొదటి రోజు. కాగా దర్బార్ చిత్రం 771 పడనున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి చిన్న సోషల్ మీడియా వార్ నడుస్తుంది. కొందరు మాత్రం తలైవా సూపర్ స్టార్ అంటూ రజినీకాంత్ ని కొనియాడుతున్నారు. సైరా వ‌చ్చిన‌ప్పుడు వార్‌, జోక‌ర్ సినిమాలు వ‌చ్చాయి.  అవి చిరంజీవి సినిమాకి గ‌ట్టి పోటీనిచ్చాయి. బాలీవుడ్ మూవీ వార్ ప‌ర్వాలేద‌నిపించుకున్నా. హాలీవుడ్ జోక‌ర్ మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.  

ఇప్పుడు తొలి రోజు ద‌ర్బార్ సోలోగా వ‌స్తోంది.. రేప‌టి నుంచి వ‌రుస‌గా విడుద‌ల‌య్యే మిగ‌తా సినిమాల‌న్నికీ  థియేట‌ర్లు మిగిలిన సినిమాల‌కు ఇవ్వాలి. తొలి రోజు వ‌ర‌కు రికార్డ్ బ‌ద్ద‌ల‌కొడుతుంది. అయితే ఈ చిత్రం బాక్సఫీస్ రికార్డులని తిరగరాస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఏది ఏమైన‌ప్ప‌టికీ ర‌జ‌నీకి ఉండే క్రేజ్ వేరే కాబ‌ట్టి తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా ఆయ‌న‌కు వీరాభిమానులు ఉన్నారు. క‌థ క‌థ‌నాలు ఎలా ఉన్నా ర‌జ‌నీ స్టైల్ కోస‌మైన ఒక్క‌సారైన మూవీ చూడాల‌నుకునేవారు చాలా మంది ఉన్నారు. కెమెరామెన్ సంతోశ్ శివ‌న్‌, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాకు వెయిట్ పెంచారు. రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. త‌మిళ్‌లో వాళ్ళు చేసిన మొద‌టి చిత్రం ఇదే కావ‌డం వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం సంక్రాంతి బ‌రిలో ఉన్న మిగ‌తా రెండు చిత్రాలకు కూడా వీళ్ళే ఫైట్స్ కంపోజ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published.