నంద‌మూరి డైలాగుల‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాయా?

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రూలర్’. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. ఈ రోజు ప్రేక్ష‌కుల (డిసెంబర్ 20న) ముందుకు వ‌చ్చింది.  ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. భూమిక ముఖ్యపాత్రలో నటించింది. ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ వాళ్ళు దీనికి U/A సర్టిఫికేట్ జారీ చేసారు.

బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వచ్చాడు. బాలయ్య లుక్స్ పరంగా నిరాశపరిచిన చరిష్మా తగ్గినా వయసు పై బడినట్లు అనిపించిన డైలాగ్ డెలివరీ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్.  మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఈ సీనియర్ హీరో.  ‘ఎవరికీరా ఫోన్ చేస్తున్నావ్.. ఫైర్ ఇంజన్ కా’ అని ఓ వ్యక్తిని విలన్ ప్రశ్నించే వాయిస్ బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ వ‌స్త‌ది. ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా’ అని అతడు అంటాడు. అదే సమయంలో బాలయ్య పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడు దానికి థియేట‌ర్ల‌లో వ‌చ్చే విజిల్ సౌండ్స్‌కి ద‌ద్ద‌రిల్లిపోతుంది. ఊహించినట్లుగానే కేఎస్ రవికుమార్ బాలకృష్ణని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా. బిజినెస్ మ్యాన్‌గా రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌య్య మెప్పిస్తాడు. 

Leave a Reply

Your email address will not be published.