దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత

సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. త్వరగానే కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు. అమ్మోరు, అరుంధతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తెరకెక్కించిన కోడి రామకృష్ణ కెరీర్ లో అగ్ర హీరోలతో పని చేశారు. గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాలు తీయడంలో ఆయన స్పెషలిస్టుగానూ పేరు తెచ్చుకున్నారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించిన అనుభవజ్ఞుడు ఆయన. 2016లో కన్నడ చిత్రం నాగహారవు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.

Leave a Reply

Your email address will not be published.