పవన్ నీకా దమ్ముందా? పాల్ సవాల్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌లు, డ్రామాలు చేస్తే ఏపీకి పెట్టుబడులు రావని, నిజంగా పవన్‌కి పవర్ ఉంటే మోదీతో మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి చూపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంపై స్పందించిన కేఏ పాల్ జనసేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే మొన్నటి వరకు పవన్ చంద్రబాబుకు మద్ధతు ఇచ్చి ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని అన్నారు.
పవన్ ఎనిమిదేళ్ళు రాజకీయాలలో ఉన్న కేవలం ఒకే సీటు వచ్చిందంటే ప్రజలు ఎందుకు నమ్మడంలేదో చెప్పాలని నిలదీసారు. హోదా విషయంలో సీఎం జగన్‌పై నిందలు వేయడం సరికాదని, అందుకు అనుగుణంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలాంటివో తెలుసుకుని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు పాల్. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇప్పటి వరకు పవన్‌పై కొంత నమ్మకం ఉన్నవారిలో కూడా విశ్వాసం కోల్పోయాడని ఎద్దేవా చేసారు. ప్రజలు మూర్ఖులు అని పవన్ అనుకుంటూ ఉంటాడని, అందుకే నిన్ను నమ్మలేదని వ్యాఖ్యానించారు.