శర్వానంద్ తో చిట్‌చాట్

శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాను’ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్‌ను సొంతం చేసుకుని విజయ పథంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ మీడియాతో చిట్‌చాట్ చేసారు. ఇందుకు సంబంధించిన విశేషాలు….
జానులో రామచంద్ర పాత్ర కీలకం మరి ఈ పాత్ర మీవరకు ఎలా వచ్చింది? ఎలా అప్రోచ్ అయ్యారు?
అవును … దిల్‌రాజుగారి మీద నమ్మకమే… కథపైనే ఆయన ఆధారపడతారు. ఆతని జడ్జ్మెంట్ మీద నాకు చాలా నమ్మకం . అంతెందుకు నాకు శతమానం భవతి కథ చెప్పినప్పుడు ఆ సినిమాలో. నా పాత్రకేం ప్రాధాన్యత లేదనిపించి అదే చెప్పాను. ఆయన నన్ను నమ్ము అనటంతో ఆ సినిమా చేశాను. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసుగా… ఆయన జడ్జ్మెంట్ సరైనదని ఆనాడే నాకు గురికుదిరింది. దిల్‌రాజు అన్న ఓ సారి ఫోన్ చేసి తమిళంతో త్రిష చేసిన `96` సినిమా చూడమంటే చూశా, కథ, కథనం నాకు చాలా బాగా నచ్చాయి. అయితే. క్లాసిక్ మూవీ లా కనిపించింది. రీమేక్ చేస్తే ఒరిజినాలిటి మిస్ అవుతామేమో? అవసరమా? అని అడిగా…. `లేదు.. నన్ను నమ్ము` ఈ సినిమా తెలుగులో రీమేక్ చేద్దాం… నాకూ ఇదే తొలి రీమేక్ అన్నారు. ఇది జరిగిన మూడు నాలుగు నెలల తర్వాతే సినిమా షూటింగ్ ఆరంభం అయ్యింది.
96 మూవీ చాలా బాగా నచ్చిందంటున్నారు. దాని ప్రభావం మీపై పడలేదా? ఆ ప్రభావం నుంచి బైట పడి ఎలా చేసారు?
లేదు… లేదు. నేను 96 ని కేవలం ఒకసారి మాత్రమే చూశాను. అయితే బాగా ఇన్వాల్వ్ అయి చూసా. సినిమా ఒకే అయ్యాక దాని జోలికి పోలేదు. డైరెక్టర్ చెప్పింది చేద్దాం… అనే ఎప్పుడూ 96 సినిమాను చూడలేదు. దాని ప్రభావం నామీద ఉండకూడదనే… డైరెక్టర్. ప్రేమ్ ప్రతి సీన్ చేసే ముందు బ్యాక్ స్టోరినీ పది నిమిషాల పాటు వివరిస్తుండటం ముందు అర్ధం కాక పోయినా . రెండు షెడ్యూల్స్ పూర్తయ్యే సరికి అర్థమైంది. 96 కన్నా గొప్పగా నా క్యారెక్టర్ని చాలా డెప్త్‌గా ఆలోచించుకుని మరీ రాసుకున్నారని, అలాగే పాత్ర కోసం ప్రత్యేకంగా హోం వర్క్ అంటూ ఏమీ చేయలేదు.. డైరెక్టర్ చెప్పింది చేసా. సమంత సెట్స్‌లో జాయిన్ అయిన తర్వాత మరింత క్లారిటీ వచ్చింది.
సినిమాలో రామ్ క్యారెక్టర్‌ను మీరు బాగా కంఫర్ట్‌గా ఫీలయినట్టు ఉన్నారే?
96 సినిమా చూసినప్పుడు ఓ రాత్రిలో జరిగే కథే కదా! సులభంగా చేయచ్చులేనని అనుకున్నా, కానీ సెట్‌లోనికి వస్తే… కష్టం తెలిసొచ్చింది. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది జానునే అని మాత్రం చెప్పగలను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు జరిగిన యాక్సిడెంట్ , మరో పక్క సమంత సీన్స్‌ను అదిరేలే చేసేస్తుండటం ఇలా నా ఆలోచనలుంటే…. జనం కూడా తమిళ చిత్రం 96తో జానుని పోల్చి చూస్తూ. సామాజిక మీడియాలో మనపై ఎక్కడ ట్రోలింగ్స్ స్టార్ట్ చేస్తారో అన్న భయం. అలాంటప్పుడు నాకు కంఫర్ట్ ఎక్కడుంటుంది. అయితే ఈ ప్రాతలో నాకు ఇబ్బంది కలగలేదు. ఇంకా బాగా నటించాలని. తపించాను. దర్శకుడు ఏం కావాలనుకుంటున్నాడో అది ఇవ్వటాని తాపత్రయపడ్డాను అని మాత్రం చెప్తాను.
మరి అనేక ఆలోచనలతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?
నిజమే… సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆ క్యారెక్టర్ మూడ్‌లోనే ఉండేవాడిని. క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయితేనే తక్కువ డైలాగ్స్, ఎక్కువ హావభావాలు పలికించేలా ప్రయత్నించగలిగాను.. ఒకవిధంగా ఇది చాలా కష్టమైన ప్రక్రియే. కానీ తెరమీద చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది.
మీ స్నేహితులను కలవటం ఈ మధ్య తగ్గించినట్టున్నారే….?
అబ్బే లేదండి… నేను, చరణ్, విక్కీ క్లాస్‌మేట్సే కదా? మేం రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ఇలా సినిమా షూటింగ్‌లు, బిజీ షెడ్యుల్ కారణంగా తగ్గిందనుకున్నా ఇది తాత్కాలికమే.
ప్రేమికుల రోజు వస్తోంది… మీ లైఫ్‌లో ఫస్ట్ లవ్ బ్రేకప్ లాంటి వేమైనా జరిగాయా?
ఎందుకుండవ్…ప్రేమలో పడిన వాళ్లలో . ఫస్ట్ లవ్‌ని పెళ్లి చేసుకునే కుర్రాళ్లు ఐదు శాతానికి మించి ఉండరు అన్నది నానమ్మకం. ఇలా చాలా మందికి బ్రేకప్స్ ఉంటాయి. అలా నా జీవితంలో జరిగింది కాబట్టే నేను సినిమాలో బాగా చేశాననిపించింది.
ఈ సినిమాలో ఏ సీన్‌కు మీరు బాగా కనెక్ట్ అయ్యారు?
పెళ్లసీన్ అది నా జీవితంలో జరిగింది . అదే పెళ్లి జరిగేటప్పుడు నేను వచ్చాను జాను… అని రామచంద్ర పాత్ర జానుకి చెప్పే సీన్
సినిమా చూసిన వారు ప్రశంసలు గుప్పిస్తుంటే ఎలా ఫీలవుతున్నారు.?
నిజానికిది రీమేక్ మువీ కదా? ఆ సినిమా చూసిన వారు జానుని చూసి రీమేక్‌లా అనిపించడం లేదని చెప్పడమే ఆనందం ఇస్తోంది. ఫ్రెష్ మూవీలా చేయటం మా తొలి సక్సెస్ అని భావిస్తున్నాం అందులోనూ విజయ్ సేతుపతి, త్రిషలను మైమరపించడం అంటే మాటలు కాదు. ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. నాకైతే ఆ ఆనందంతో మాటలు రావడం లేదు.
సమంతతో కలసి చేసారుగా ఆ అనుభవం ఎలా ఉంది?
మీరన్నది నిజమే…. ఆమె నటించే తీరు చూస్తే ఎవరూ ఊరకనే సూపర్‌స్టార్స్ అయిపోరనిపించక మానదు ఎవరికైనా., నేనో స్టార్ హీరోయిన్ అన్న గర్వం కించత్ కూడా లేదు ఆమెలో . దర్శకుడు టేక్ చెప్పాక నటించిన ప్రతిషాట్‌ను స్క్రీన్‌లో చూసుకుని ఇంకా బాగా ఎలా చేయాలా? అనుకుంటూ చేసేది.. ఆమెను చూసి నేర్చుకుని, నేను కూడా ఇప్పుడు సీన్స్‌ను స్క్రీన్‌పై చూసుకోవడం మొదలు పెట్టాను. ఈలాగే ప్రతి సీన్‌ను చేసే ముందు నాతో డిస్కస్ చేయటం ద్వారా సీన్ బాగా రావటానికి సహకరించేంది. . ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను.. ఇవి ఇప్పుడు నా నట జీవితానికి చాలా ఉపయోగపడేవే.
సరే… సినిమా అంతా ప్రధానంగా రెండు పాత్రలతో నడిపించడం రిస్క్ అనిపించలేదా?
లేదండీ…. సినిమా చూసినప్పుడు కానీ, రీమేక్ లో నటిస్తున్నప్పుడు కానీ అలాంటివి ఆలోచించలేదు. . అయితే రెండు పాత్రలతో సినిమాను నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ప్రేమ్‌కే దక్కుతుంది. నా కెరీర్లో నాకు గుర్తుండిపోయే సినిమా జాను. నటుడిగా నా ఆకలిని తీర్చిన సినిమా ఇది.
రీమేక్ సినిమా చేయడం మీకెలా అనిపిస్తుంది?
నిజానికి నేను ఇతర భాషా చిత్రలని రీమేక్స్ చేస్తే పోలికలు చూస్తారని, చేయకూడదని ఫిక్స్ అయ్యాను మనకు తెలియకుండానే ఒత్తిడి ఉంటుంది కదా? సాధారణంగా నటుడిగా ఎన్నో హిట్స్ రావచ్చు. కానీ కొన్ని సినిమాలే గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే సినిమా కావటంతో నాదైన స్టైల్లో నటించా అంతే
ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ జోరు పెంచినట్టున్నారుగా?
అవునండి… తక్కువ రోజుల కాల్షీట్స్తో చేయాలని అక్షయ్‌కుమార్‌లా నిర్ణయిం తీసుకున్నాను. పడిపడి లేచె మనసు, రణరంగం సినిమాల తర్వాత మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నా, మూడు సినిమాలు పూర్తి కాగానే.. మరో మూడు సినిమాలను ట్రాక్ ఎక్కిస్తాను.
విభిన్న కథాంశంగా చెపుతున్నమీ `శ్రీకారం` ఎందాకా వచ్చింది?
. రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అనే పాయింట్‌ను ఆధారంగా సినిమా రూపొందింది. . ఇందులో రైతు పాత్రలో కనపడతాను. కథ, కథనాలు బాగా వచ్చాయి..తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. రైతుల పరంగా వారి సాధకబాధకాలుంటాయి. అలా అని ఎవరిపై విమర్శలు చేయడం లేదు.. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తుంది. ఏప్రిల్ 24న విడుదల చేయాలనుకుంటున్నాం
అవును అమలగారి కొడుకుగా ఓ సినిమా చేస్తున్నారటగా…
అవును ఇది ద్విభాషా చిత్రం త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇది అమ్మ కొడుకు కాన్సెప్ట్ మీద నడిచే సినిమా. అక్కినేని అమలగారికి కొడుకుగా నటిస్తున్నాను.