విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలు మిలీనియం టవర్స్‌లో
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఓ వైపు చిలికి చిలికి గాలివానగా మారుతుంటూ మరోవైపే వైఎస్ జగన్ సర్కార్.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తరలింపు దిశగా శర వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధికారులకు వైసీపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. విశాఖలోని మిలినీయం టవర్స్‌లో కొత్త సచివాలయం ప్రారంభించే దిశగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అమరావతిలోని . ప్రాధాన్యత కలిగిన శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద విడతలవారీగా సచివాలయం తరలింపునకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తోంది 34 శాఖలలో కీలక విభాగాల ను గుర్తించి వాటిని విశాఖ తరలించాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది. దీనికి తోడు ఆంధ్ర యూనివర్సిటీ అతిధి గృహాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చాలని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.