చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ పతాకంపై విక్కీరాజ్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చెడ్డీ గ్యాంగ్’. కనగాల రమేష్ చౌదరి దర్శకుడు.  శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్రధారి. అమర్, ప్రదీప్వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ఇతర తారాగణం. ఈ సినిమా టీజర్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది..
అతిథి శివాజీరాజా మాట్లాడుతూ  చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి. మలేషియా, ముంబైలో చిత్రీకరించారు. ఆ రిచ్నెస్ కనిపిస్తోంది. దర్శకుడు రమేష్ చాలా సీనియర్. ఈ సినిమా హిట్ అవ్వాలి” అన్నారు. దర్శకుడు రమేష్ చౌదరి మాట్లాడుతూ –  అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో- డైరెక్టర్‌గా పని చేశాను. ఈ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళ్లి అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్రం కథాంశం. సింగిల్ లైన్‌లో విక్కీరాజ్ కి కథ చెప్పాను. కేరళ రండి.. సినిమా తీద్దాం అన్నారు. అలా ఈ సినిమా మొదలైంది. 125 రోజులు షూటింగ్ తీశాం” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ కేరళ- ఎర్నాకుళం, ఇరిట్టి అడవులు, హైదరాబాద్ సారధి స్టూడియో, రామోజీ ఫిలింసిటీ, మలేషియాలో (25రోజులు) ఈ సినిమాను తెరకెక్కించాం. మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకే హైలైట్. చిత్రంలో ఐదు పాటలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ పాట యువతను ఆకట్టుకుంటుంది” అన్నారు. పద్మాలయ మల్లయ్య, సెన్సార్ సభ్యులు ఎంఎస్ రెడ్డి, గీత రచయిత లక్ష్మణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published.