రిజర్వేషన్ బిల్ ఎన్నికల స్టంటే : గంటా


విధి విధానాలు చర్చించకుండా హడావిడిగా బిల్లు పెట్టడం ఖచ్చితంగా ఎన్నికల స్టంటే నని ఏ పి మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విశాఖపట్టణం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలలోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని కాని సాద్యా సాధ్యాలు చర్చించకుండా  హడావిడిగా బిల్ పెట్టడం ఖచ్చితంగా ఎన్నికల స్టంటే నని రఫెల్ కుంభకోణం పై దేశ ప్రజలు చర్చించు కుంటున్న తరుణం లో ప్రజల ద్రుష్టి మరలించేందుకు హడావిడిగా ఈ బిల్లు తీసుకువచ్చారన్నారు, మోదీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష పూరితంగా వ్యహరిస్తున్నారన్నారు గత ఎన్నికలలో బీజేపీ తో పొత్తు వల్ల టీడీపీ పదిహేను సీట్లు నష్టపోయిందన్నారు ఈ సందర్భంగా జగన్ ఆస్తులపై కూడా మంత్రి గంటా విరుచుకు పడ్డారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తులు ఐదేళ్లలో ఏడువందల డెబ్భై రెట్లు పెరగడం వెనుక మర్మమేమిటో తెలియజేయాలని గంటా డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published.