కృష్ణమూర్తి కార్పొరెట్ క్రైమ్ కహానీ

పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను కె.ఎస్ రామారావు, విడుదల చేశారు. చిత్ర దర్శకుడు శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. నేటి తరానికి నచ్చేలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ ఎప్పటికి మరచిపోలేము . అందరికి మా ‘ఐఐటి కృష్ణమూర్తి’ నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు.
చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి తొలిసారి అయినా విషయం ఉన్న మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల, కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు. 

Leave a Reply

Your email address will not be published.