‘రైట్ టు ఇంగ్లిష్ ‘ పేద విద్యార్థుల కోసమే

వివిధ బిల్లులపై ఆమోదం తెలిపేందుకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని భావించిన ప్రభుత్వం దానిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటంతో నాలుగోరోజు కూడా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగో రోజు సమావేశాలను తెలుగుదేశం పార్టీ బాయ్‌కట్ చేయటంతో అధికారపక్షమే చట్టాలపై చర్చ నిర్వహించింది.
ఈ సందర్భంగా గురువారం సభలో ప్రవేశ పెట్టిన విద్యాచట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదంఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ పేద, బడుగు వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమం లో చదివి ఈ ప్రపంచంలో పోటీ పడేలా తీర్చి దిద్దే సదాశయంతో ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన తప్పని సరి కానుందని , పేద విద్యార్థుల కోసమే రైట్ టు ఇంగ్లిష్ విధానం తీసుకొచ్చామన్నారు. జూన్ 1 నుంచి జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్‌ను విద్యార్థులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.