రకుల్ సోదరుడు హీరోగా..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా షేక్ షా వలి సమర్పణలో రజిని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై దాసరి లారెన్స్ దర్శకత్వంలో మావురం రజిని నిర్మాతగా కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా, హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో… రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ – నా సోదరుడు అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం తనకు హీరో కావాలనుందని చెప్పగానే.. ప్యాషన్ ఉందా? ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలని తనతో అన్నాను. తను ప్యాషన్ ఉందని చెప్పాడు. ఎంతో పట్టుదలగా తెలుగు నేర్చుకుని తన ప్యాషన్ ఏంటో చూపించాడు. నాకు హైదరాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమన్కు కూడా ఇప్పుడు హైదరాబాద్ హోం టౌన్లా మారింది. తను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను అన్నారు.
దర్శకుడు దాసరి లారెన్స్ మాట్లాడుతూ – లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో రూపొందే సినిమాలో అమన్ హీరోగా పరిచయం అవుతున్నారు. తన పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. మంచి కామెడీ కథలో భాగంగా ఉంటుంది. మార్చి మొదటి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది అన్నారు. నిర్మాత మావురం రజిని మాట్లాడుతూ –  మా బ్యానర్లో రూపొందుతున్న తొలి చిత్రం దాసరి లారెన్స్గారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాం. అలాగే అమన్గారిని మా బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. మార్చి ఫస్ట్ వీక్లో షూటింగ్ ప్రారంభించాం. ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాం అన్నారు.
అమన్, మోనికా శర్మ హీరో హీరోయిన్‌గా నటిస్త్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రాబిన్-నభా, కో డైరెక్టర్: బూరుగుపల్లి సత్యనారాయణ, కెమెరా: జి.ఎల్.ఎన్.బాబు, మ్యూజిక్: మోహిత్ రెహమానిక్, సహ నిర్మాత: పి.వెంకటేశ్వర్లు, నిర్మాత: మావురం రజిని, కథ, కథనం, దర్శకత్వం: దాసరి లారెన్స్

Leave a Reply

Your email address will not be published.