వెంక‌టేశ్ విడుదల చేసిన “జై సేన” చిత్రం

వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన‘.  శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమా  టీజ‌ర్‌, పాటలు విడుద‌లై ప్రేక్ష‌కుల నుంచి మంచి  రెస్పాన్స్  తెచ్చుకోగా తాజాగా  ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల‌చేశారు. 
ఈ సంద‌ర్భంగా.. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ –  . ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వ‌చ్చే స‌ముద్ర‌.   దర్శకత్వం వ‌హించిన ‘జైసేన’ ది పవర్ ఆఫ్ యూత్ మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను .  ఒక మంచి స్క్రిప్ట్ చూసాన‌ని అనుభూతి క‌లిగింది.  శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది నటించారు.   ఒక మంచి సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. అందరి హీరోల అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’. అన్నారు

నటుడు శ్రీ కార్తికేయ  ప్రవీణ్ కుమార్ , అభిరామ్, హరీష్‌గౌతమ్ త‌దిత‌రులు ఈ స‌మావేశంలో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.