మాట నిలబెట్టుకున్న పవన్..

ఢిల్లీలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. గత ఏడాది డిసెంబర్ 6, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించిన ఆయన అన్నమాట ప్రకారం నేడు స్వయంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళం చెక్కును ఆర్మీ అధికారికి అందించారు. అనంతరం సైనిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
పవన్ మీడియాతో మాట్లాడుతూ… సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయలు అందించానని చెప్పారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నది తన అభిప్రాయమని అన్నారు పవన్.