చరణ్ కోసం హరీశ్ శంకర్ వెయింటింగ్

రామ్ చరణ్ కోసం నిరీక్షిస్తున్నవారిలో వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ లు ఇప్పటికే ఉండగా తాజాగా మాస్ సినిమాల దర్శకుడు హరీశ్ శంకర్ కుడా ఈ క్రమంలో చేరాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తదుపరి ఆతని కాల్షిట్ల కోసం సినీ దర్శకులు వరుస కడుతున్నారు.
టాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్నగద్దలకొండ గణేశ్.. రూపొందించిన హరీశ్ రామ్ చరణ్ కోసం ఓ అద్భుత కథను సిద్ధం చేశాడని, చరణ్‌ని వినిపించి డేట్స్ ఫిక్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. చెర్రీని డిఫరెంట్ యాంగిల్ చూపించేలా ప్రాజెక్ట్ సిద్ధం చేశాడట. రామ్ చరణ్ గతంలో చేసిన చిరుత, రచ్చ, నాయక్, ఎవడు లాంటి మాస్ సినిమాలన్నీ విజయాలు సాధించాయి. ఇప్పుడు హరీశ్ సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మెగా అభిమానులకు ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నం అందినట్టే నని ఫిలింనగర్ వర్గాల మాట.