టిడిపి ఉత్తరాంధ్రా జంప్ జిలానీల కు మార్గం దొరికిందా..?
గత కొంతకాలంగా వైసిపిలో చేరాలనుకుంటున్న ఉత్తరాంద్ర టిడిపినేతలకు మార్గం దొరికింది. న్ఆర్సీ, రాజధాని అంశంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామాలు చేసి వైసిపిలో చేరేందుకు మర్గం సుగమం అయిందని ఆనందిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ సాయంత్రం విశాఖపట్టణంలోని ఓ హోటల్ లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై, విశాఖను రాష్ట్రప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకురావటంపై స్వాగతిస్తూ, ఓ తీర్మానం చేసి అధినేత చంద్రబాబుకు పంపుతునే, దీనిని వ్యతిరేకిస్తే, పార్టీని వీడేదందుకు సిద్దమేనని దాదాపు హెచ్చరికలు చేసినంత పనిచేసారు.
ఇది జరిగిన రెండు రోజులకే విశాఖ మాజీ శాసనసభ్యుడు రహమాన్ మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్నారని, ఇది తమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడమేనంటూ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు పంపారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబునాయడు కోరుతున్నారు.మూడు రాజధానుల అంశంపై ఎవరూ కూడ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. గతంలో రాజధాని రైతుల ను భూసేకరణ సమంలో చంద్రబాబు తీసుకొన్న నిర్ణయాలే ప్రస్తుత ఆక్రమందనలుకు కారణమని, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం విశాఖ నేతలు బలవుతున్నారని రహమాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా రెహమాన్ టిడిపిని వీడి వైసిపిలో చేరాలని భావిస్తున్నారని, ఇప్పుడు ఛాన్స్ దొరికినట్టుందని తెలుగుతమ్ముళ్లు చెపుతుండటం విశేషం.